Saturday 21 June 2014

డిప్రెషన్ - అస్పిరెషన్

0 comments
బాధ లో ఉన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుందంటే .... నిజంగా తట్టుకోలేనంతగా నొప్పి బాదిస్తుంది ,బోరున ఎడవాలనిపిస్తుంది ,కంటి నుంచి వాటంతట నీరు అలా వస్తూనే ఉంటాయి ,పిచ్చి పిచ్చి ఆలోచనలు మనల్ని వెక్కిరి స్తుంటాయి మనం నిజంగా దేనికి పనికిరామో అనేంతగా ... మనల్ని దిగజారుస్తాయి దాంతో లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఉహించుకొని ... ఎవరిమీదో కోపం ఎవరితో చూపించాలో తెలిదు .. వాళ్ళు వీళ్ళు నిన్నుయూస్ చేస్కొని వదిలేసేవాళ్ళు ... సహాయం కోసం అడిగిన చూసే దిక్కేలేదు .... ఎవరికీ చెప్పుకోలేక ఎవరితో పంచుకోలేక నరకం అనుభవిస్తాం .... ఆ గడియలు మనకు యమగండాలు గా మన చుట్టూ తిరుగుతున్నట్టు ... ఏదో ఐపోతున్నట్టు .... ఉహించేసుకొంటాం ///

ఇలాంటి సమయం లో నిజంగా ఈ మనుషులు వద్దు ఏమి వద్దు అస్సలు ఈ జీవితం ఒద్దు ఎక్కడికైనా హాయిగా పారిపోవాలనిపిస్తుంది ...

ఇలాంటి డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనకు అందరూ ఆనందగా నే కనపడుతారు ... ఒక్క మనం తప్ప ...ఏదో చెయ్యాలి అన్న తపన పెరుగుతుంది ... ఇలాంటి ఆలోచనలతో మనకి మనం నిక్కబొడుసుకోని ఒక మూలకి అంకితమై పోతం ... ఎం చేస్తునామో తెలియదు ,ఎం చెయ్యాలో తెలియదు ,అస్సలు ఒక్కోసారి మనం ఉన్నామో లేమో కూడా తెలిదు ...

అప్పుడు పుడుతుంది ఏదో ఒకటి సాదించాలి అన్న కసి కోపం ... నరనరాలో జీర్ణించుకు పోతుంది .... అప్పుడు ఎవ్వరు నీకు కనపడరు కేవలం నీ కోరిక ... అది సాదించాలనే కసి తప్ప ...

ఒక్కసారి తల పైకెత్తి చూడు ... వేసే ప్రతి అడుగు ... నీ ఆశ నీ శ్వాస అన్ని ఒక్కటై నీ గమ్యాన్ని చేరుస్తాయి ................. :)



Tuesday 17 June 2014

నీతో నువ్వే ....

0 comments

ఒక ప్రాబ్లం మనకు పదే పదే బాధపెడుతుంటే మనల్ని మనం ఆ ఉచ్చు లో బిగుసుకుపోయి ఏడుస్తూ , ఆలోచనల ఊబి లో కుమిలి కుమిలి మనల్ని మనం మోసం చేసుకొంటాం ... ఎవరితో మాట్లాడం అలా ఒక్క నీతో నే నువ్వు క్రుంగి కృశించే అందరిని బాధపెడుతూ నువ్వు బాధపడుతూ ఉండడం కంటే ఆ ప్రాబ్లం పదే పదే నిన్ను బాధపెడుతుంది వాళ్లన్న మాటలు తూటాల గుచ్చుకోవచ్చు ... మళ్ళి మళ్ళి నిన్ను ఇరకాటం లో పడేయచు ... వాళ్ళ చూపు ముల్లుళ్ళ తగలచ్చు ... కాని ఒక్కటి గుర్తుంచుకో

నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఎందరో ఉంటారు కాని నువ్వు డిసైడ్ చేయ్స్కో బాధ పడాల లేక వదిలేయాల //
అలాంటివాళ్ళు మళ్ళి మళ్ళి పుడుతూనే ఉంటారు పుట్టగొడుగుల్లా కాని అందులో నువ్వు మళ్ళి మళ్ళి ఎందుకు కురుకుపోవాలి ... మనల్ని సంతోష పరిచిన క్షణాలు కోకోల్లల్లు వాటిని స్మరిస్తూ పుట్టగోడులను తోక్కేయటమే ... లేక తరిమేయటం ...

మధుర క్షణాలు, తీపిగురుతులు ,కల్మషం లేని నవ్వులు .. రోజులు గడుస్తున్న కొద్ది నిన్ను వెంటాడే వాళ్ళు వేటాడి వేటాడి అలసి పోతారు ... చేతకాక చెత్త మాటలతో కాలం గడిపేస్తారు ... కాని నీ గురించి నీకు తెలుసు ఎవరో ఏమో అంటారని అనుకొంటారని నువ్వు మాధనపడితే నువ్వు కుమిలిపొయెదన్ని చూసి చూసి వాళ్ళకి మళ్ళి ఆశ రేపుతున్నట్టే అవుతుంది ...

మనం తప్పుచేయనంత వరకు దేనికి బయపడాలి .... దేనికోసం తాపత్రయ పడాలి ...
నిన్ను నువ్వు అర్ధం చేసుకొంటే చాలు కదా ... వేరే వాళ్ళకి ఛాన్స్ ఎందుకివ్వాలి .......

ఎవరో ఏదో చేస్తారు ... ఎవరో ఏదో అంటారు ... పోతారు ... అన్ని నీ మంచికే నిజం నిన్ను నువ్వు నీతో నువ్వు గడపడానికి నువ్వేంటో తెలుసుకోవడానికి అవి మంచికే ... ముర్కత్వం ,అంధకారం ,అహంకారం తో కొట్టు మిట్టాడే వాళ్ళు కొట్టుకోపోతరంతే ..

నువ్వు ప్రశాంతం గ ఉండు నీకు నచ్చితే చేయి లేకపోతె లేదు ..... నువ్వేంటో నీకు తెలిసినప్పుడు ఎవరినో ఎందుకు ఇంప్రెస్స్ చెయ్యాలి ....

చివరిగా

....

నీతో నువ్వే
ఎవరు ఉన్నా లేకున్నా నీతో నువ్వే ...
ఎవరు ఎమన్నాఅనకున్నా  నీతో నువ్వే
అవును చివరాకరికి కూడా నీతో నువ్వే ...
నవ్వు నవ్వు ఈ లోకమంతా నువ్వు నువ్వే నని :)

nenu-namanasu

Total Pageviews

About me

My Photo
చిన్ని
ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ...జీవితాన్ని ఆస్వాదిస్తూ...అందరిని అనందం తొ చూడాలనుకొనె తెలుగు అమ్మాయిని.......
View my complete profile





Recent Comments


Blogger Widgets

Labels

Flash Labels by Way2Blogging



nenu-namanasu. Powered by Blogger.


Translate

Popular Posts

haaram logo